మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఏపీలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారం షెడ్యూల్ ఖ‌రారు అయ్యింది. ఈ నెల 10న 12 కార్పొరేష‌న్లు, 75 న‌గ‌ర పంచాయతీల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌చారానికి వెళుతున్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ నెల 4న కర్నూలు జిల్లాలో... 5న చిత్తూరు జిల్లాలో, 6న విశాఖ‌, 7న విజ‌య‌వాడ‌లోనూ ఆయ‌న ప్ర‌చారం చేస్తారు. ఈ నెల 8న గుంటూరు జిల్లాలో పురపాలక ఎన్నికల ప్రచారంతో ఆయన పర్యటన ముగియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: