మార్చి నెల వ‌చ్చిందో లేదో దేశ‌వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కేసింది. ఎముకలు కొరికే చలి మాయమై మాడుపగిలే ఎండలు కాస్తున్నాయి. ఈ రేంజ్‌లో ఉష్ణోగ్ర‌త‌లు పెర‌గ‌డానికి ప‌శ్చిమ ప‌వ‌నాల‌ ప్రభావం పెద్దగా లేకపోవడమే కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ప‌వ‌నాల‌ ప్రభావం పెద్దగా లేకపోవడంతో అనేక ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నేల పొడిబారి తేమ ప్రభావం తగ్గింది. శీతల గాలులు కూడా తగ్గడంతో ఒక్కసారిగా భూమి వేడెక్కి పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. హిమాలయాల్లో వర్షాలు లేకపోవడం కూడా ఒక కారణమని భారత వాతావరణ శాఖ నిపుణుడొకరు విశ్లేషించారు. ఇప్ప‌టికే కొన్ని చోట్ల స‌రాస‌రీ ఉష్ణోగ్ర‌త‌లు 40 డిగ్రీలు దాటితే... రామ‌గుండం, రెంట‌చింత‌ల లాంటి చోట్ల ఉష్ణోగ్ర‌త‌లు 45 డిగ్రీలు దాటేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: