పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీలో వైసీపీ,  టీడీపీ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. అంతర్గత ఒప్పందం నేపథ్యంలో 13 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. వైసీపీ  9, టీడీపీ నాలుగు వార్డులు ఏకగ్రీవం చేసుకున్నాయి.   మొత్తం  23 వార్డులలో ఏకగ్రీవం అయినవి కాకుండా,  మిగిలిన పదివార్డులకు ఎన్నికలు  నిర్వహిస్తున్నారు. ఏకగ్రీవాల పర్వం పై టీడీపీ అధిష్ఠానం సీరియస్  అయింది.

ఏకగ్రీవాలు కాకుండా ఎన్నికలకు వెళ్ళాలని,  పలుమార్లు సమావేశాలు నిర్వహించిన పార్టీ నాయకులు ఇలా చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎన్ని సార్లు చెప్పినా సరే ఏకగ్రీవాలు జరగడంతో అధిష్ఠానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఇక ఈ నియోజకవర్గంలో పంచాయితీల్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభావం చూపించలేదు. ఇక ఇప్పుడు ఇలా ఎకగ్రీవాలు జరగడంతో నియోజకవర్గ స్థాయి నేతలపై రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షుడిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: