తెలుగుదేశం పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు త‌న ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దుచేసుకున్నారు. చిత్తూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చిత్తూరు, తిరుప‌తిలో పుర‌పాల‌క సంఘ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొనాల్సి ఉంది. విశాఖప‌ట్నం ఉక్కు క‌ర్మాగారం ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు నిర‌స‌న‌గా బంద్‌కు పిలుపునివ్వ‌డంతో త‌న ప‌ర్య‌ట‌న‌ను వాయిదా వేసుకున్న‌ట్లు చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. విశాఖ ఉక్కు ఏర్ప‌డ‌టానికి తెలుగువారి ఉక్కు సంక‌ల్ప‌మే కార‌ణ‌మ‌ని, బంద్‌కు తాము పూర్తిస్థాయిలో మ‌ద్ద‌తిస్తున్నామ‌ని చెప్పారు. బంద్‌ను విజ‌య‌వంతం చేయ‌డానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు శాయ‌శ‌క్తులా కృషిచేస్తార‌ని, తెలుగు ప్ర‌జ‌ల మ‌నోభావాల‌తో ముడిప‌డివున్న ఉక్కు క‌ర్మాగారం ప్ర‌యివేటీక‌ర‌ణ‌ను అడ్డుకుంటామ‌ని, కార్మికుల ప్ర‌యోజ‌నాల‌ను కాపాడ‌తామ‌ని చంద్రబాబు హామీఇచ్చారు. ప్ర‌యివేటీక‌ర‌ణ‌ను అడ్డుకోవాల్సిన బాధ్య‌త అధికార వైసీపీపై ఉంద‌ని, వారి ప్ర‌యోజ‌నాలు వారు చూసుకుంటూ కార్మికుల ప్ర‌యోజ‌నాలు గాలికొదిలేస్తున్నార‌ని మండిప‌డ్డారు.ప్ర‌భుత్వానికి నిజంగా విశాఖ ఉక్కుపై ప్రేమ ఉంటే బంద్‌కు పూర్తిస్థాయిలో మ‌ద్ద‌తివ్వాల‌ని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: