ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం నిర‌స‌న‌ల‌తో హోరెత్తుతోంది. విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్ర‌యివేటీక‌ర‌ణ‌ను నిర‌సిస్తూ ప్ర‌తిప‌క్షాలు ఈరోజు బంద్‌కు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా బంద్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తూ ఆర్టీసీ బ‌స్సుల‌ను ఈరోజు మ‌ధ్యాహ్నం వ‌ర‌కు నిలిపివేయాల‌ని, ఆ త‌ర్వాత నుంచి న‌డిపించాల‌ని నిర్ణ‌యించుకుంది. హిందూపురంలో ఎన్నిక‌ల ప్ర‌చార‌స‌భ‌లో పాల్గొన్న నంద‌మూరి బాల‌కృష్ణ రోడ్‌షోలో భాగంగా విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హ‌క్కు అంటూ నినాదాలు చేశారు. విశాఖప‌ట్నం న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హిస్తున్నారు. రాజ‌ధాని రైతులు విశాఖ ఉక్కు క‌ర్మాగారానికి మ‌ద్ద‌తుగా రోడ్డుమీద నిర‌స‌న‌కు దిగారు. మంద‌డం గ్రామంలో స‌చివాల‌య ఉద్యోగుల‌ను అడ్డుకోవ‌డంతో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. స‌చివాల‌యం వై జంక్ష‌న్ వ‌ర‌కు పాద‌యాత్ర చేప‌ట్టారు. పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో శాంతిభ‌ద్ర‌త‌లు అదుపులోనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: