ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పుబడుతుంది. ఇక రాష్ట్రంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరగడంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే నేడు రాష్ట్రంలో బంద్ జరుగుతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించి తన వంతుగా సహకారం అందిస్తుంది.

విశాఖలో వైసీపీ నేతలు బంద్ లో పాల్గొన్నారు. వైఎస్సార్‌ సీపీ ఎంపీలు  విజయసాయిరెడ్డి,  ఎంవీవీ సత్యనారాయణ, మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్‌,  కరణం ధర్మశ్రీ వంటి వారు బంద్ లో పాల్గొన్నారు. అలాగే రాయలసీమ జిల్లాల్లో కూడా పలువురు మంత్రులు బంద్ లో పాల్గొన్నారు. స్కూల్స్, బ్యాంక్‌లు, వ్యాపార సంస్థ‌లు, దుకాణాలు, సినిమా హాల్స్ స్వచ్చందంగా మూసివేసారు. వామపక్షాలు కూడా బంద్ లో పాల్గొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: