హైదరాబాద్ హాస్పిటల్స్ లో జరుగుతున్న వ్యాక్సిన్ సెంటర్స్ ను సడన్ విజిట్ చేస్తున్నారు హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి. ఫీవర్ హాస్పిటల్ ను విజిట్ చేసిన కలెక్టర్ ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేసారు. కనీసం టెంట్ కూడా లేకుండా వెయిటింగ్ ఏరియానా ? అంటూ సీరియస్...అర్జెంట్ గా టెంట్ వేయించండి అని ఆమె ఆదేశించారు. వృద్దులు వస్తున్నారు కాబట్టి టెంట్ ఉండాల్సిందే అన్నారు.

వ్యాక్సినేషన్ సెంటర్ ను ఫస్ట్ ఫ్లోర్ లో ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. సరిపడినన్ని వీల్ చైర్స్  లేవు అంటూ ఫైర్ అయ్యారు. సాఫ్ట్ వేర్ కోసం సిస్టం లను పెంచమని సీరియస్ అయ్యారు. ఫండ్స్ లేవని ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శంకర్  వివరించగా... టెంట్ కు ఎంత అవుతుంది.. ?? 50 వేలు అంతేగా.. శాంక్షన్ చేస్తా అన్నారు. టెంట్ వేసుకోండి.. అంటూ సీరియస్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: