సాధార‌ణంగా ఒక అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటారు... ఇంకా చెప్పాలంటే ముక్కోణ‌పు ప్రేమ‌లు మ‌నం చూశాం. అయితే యూపీలోని రాంపూర్ జిల్లాలో ఓ అమ్మాయి ఏకంగా న‌లుగురు యువ‌కుల‌ను ప్రేమించింది. ఈ విష‌యం తెలిసిన యువ‌కులు ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లారు. విస్తుపోయిన గ్రామ‌స్తులు ఆ అమ్మాయితో పాటు ఆ యువ‌కులు న‌లుగురిని తీసుకువ‌చ్చారు. ఆ యువ‌కులు న‌లుగురిలోనే ఎవ‌రో ఒక‌రితో ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. నీకు ఆ నలుగురిలో ఏ అమ్మాయి అంటే ఇష్ట‌మ‌ని అడ‌గగా.. ఆమె న‌లుగురు ఇష్ట‌మ‌ని చెప్పింది. దీంతో ఆ న‌లుగురు యువ‌కుల‌ను మీలో ఆ అమ్మాయిని ఎవ‌రో చేసుకుంటారో నిర్ణ‌యం తీసుకోమ‌ని చెప్పారు. చివ‌ర‌కు ఆ న‌లుగురు యువ‌కులు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చి లాట‌రీ వేసి అందులో పేరు వ‌చ్చిన యువ‌కుడితో ఆ అమ్మాయి పెళ్లి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: