దేశంలోని కొన్ని రైల్వేస్టేష‌న్ల‌లో ప్లాట్‌ఫామ్ టికెట్ ధ‌ను రూ.10 నుంచి రూ.30కు పెంచారు. ఈ చ‌ర్య‌ను రైల్వేశాఖ స‌మ‌ర్థించుకుంటోంది. అత్య‌ధిక జ‌న‌స‌మ్మ‌ర్థం ఉన్న స్టేష‌న్ల‌లోనే ఈ పెంపు వ‌ర్తిస్తుంద‌ని, ప్ర‌యాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది. క‌రోనా వ్యాప్తిచెంద‌కుండా స్టేష‌న్ల‌లో ర‌ద్దీని నియంత్రించ‌డానికి ప్లాట్‌ఫామ్ పెంపు ధ‌ర నిర్ణ‌యం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తాము భావిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ప్లాట్‌ఫామ్ ధ‌ర పెంచామంటూ ఆయా స్టేష‌న్ల‌లో పోస్ట‌ర్లు అతికించి, వాటిని ప్ర‌యాణికుల‌కు చూపించి మ‌రీ రూ.30 వ‌సూలు చేస్తుండ‌టంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలోనే ప్ర‌యాణికులు ప్లాట్‌ఫామ్‌పైకి రాకుండా ఉంటార‌ని, ఈ త‌ర‌హా నిర్ణ‌యం కొత్తేమీ కాద‌ని, ముంబ‌యిలోని కొన్ని స్టేష‌న్ల‌లో రూ.50 వ‌సూలు చేస్తున్నామ‌ని చెప్పింది. గ‌తంలో కూడా కొన్ని ఎంపిక చేసిన స్టేష‌న్ల‌లో రూ.30 వ‌ర‌కు వ‌సూలు చేశామ‌ని, క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల‌ను అంచ‌నావేసి ష్టేష‌న్‌కు వ‌చ్చేవారిని త‌గ్గించ‌డానికి ఈ నిర్ణ‌యం ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని రైల్వేశాఖ స‌మ‌ర్థించుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: