తెలుగుదేశం పార్టీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. అనూహ్య‌మైన రీతిలో వేసిన ఈ ఎత్తుగ‌డ‌తో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ షాక్ తింది. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక నిలిపేయాలంటూ టీడీపీ త‌ర‌ఫున రాష్ట్ర హైకోర్టులో హౌస్‌మోహ‌న్ పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిని న్యాయస్థానం ఆదివారం విచారించింది. చిత్తూరు న‌గ‌ర‌పాల‌క సంస్థ ప‌రిధిలోని 50 డివిజన్లకు గాను 37 డివిజన్లు ఏకగ్రీవం కావడంతో ఎన్నికలతో సంబంధం లేకుండా ఈ న‌గ‌ర‌పాల‌క సంస్థ‌ను  వైసీపీ గెలుచుకున్న‌ట్లైంది. 18 డివిజన్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నామినేషన్ల‌ను ఫోర్జరీతో వైసీపీవారే ఉప‌సంహ‌రించార‌ని, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపేవ‌ర‌కు చిత్తూరు ఎన్నిక‌ల ప్ర‌క్రియ నిలిపేయాలంటూ పిటిష‌న‌ర్లు హైకోర్టును ఆశ్రయించారు. వీరి త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాది ద‌మ్మాల‌పాటి శ్రీ‌నివాస్ వాద‌న‌లు వినిపించారు. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ వివ‌ర‌ణ కోరుతూ ఏపీ హైకోర్టు ఈ కేసు విచార‌ణ‌ను సోమ‌వారం మ‌ధ్యాహ్నానికి వాయిదా వేసింది. తిరుప‌తి ఏడోవార్డు కేసు కూడా విచార‌ణ‌కు రావ‌డంతో చిత్తూరు, తిరుప‌తి రెండింటినీ క‌లిపి వాద‌న‌లు వింటామ‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: