తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ(37) క‌న్నుమూశారు.  కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాంజీ అవయవాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఆయన భౌతికకాయాన్ని ఏలూరు త‌ర‌లిస్తారు. అనంతరం స్వగ్రామం చాటపర్రులో అంత్యక్రియలను నిర్వహిస్తారు. రాంజీ మరణం పట్ల తెలుగుదేశం పార్టీ నేత‌లు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు, జాతీయ కార్య‌ద‌ర్శి లోకేశ్, వైసీపీ నేత దేవినేని అవినాష్‌ ఇప్ప‌టికే ఫోన్‌లో బాబును ప‌రామ‌ర్శించారు. ఈ నెల 3వ తేదీన రాంజీ ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే రాంజీ గుండెపోటుకు గురైన‌ట్లు తెలుగుదేశం వ‌ర్గాలు తెలిపాయి. పరిస్థితి మెరుగు పడటంతో ఏలూరుకు వెళ్లిపోయారు. అయితే మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో అక్కడే ఆసుపత్రిలో చేర్చారు.  పరిస్థితి విషమంగా మార‌డంతో మ‌ళ్లీ విజ‌యవాడ ఆసుపత్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ క‌న్నుమూశారు.  జెండా ప‌ట్టిన ప‌సుపు సైనికుడి మ‌ర‌ణం పార్టీకీ, తనకు తీర‌ని లోట‌ని లోకేశ్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: