కేంద్ర ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి మ‌రోసారి మొండిచెయ్యి చూపించింది. ఉమ్మ‌డి ఏపీగా ఉన్న‌ప్ప‌టిక‌న్నా విభ‌జిత ఏపీగా ఉన్న‌ప్పుడే స‌హాయ నిరాక‌ర‌ణ రోజురోజుకూ పెరిగిపోతోంది. రామాయ‌ప‌ట్నం పోర్టు నిర్మాణానికి తాము స‌హాయం చేయ‌లేమ‌ని తెగేసి చెప్పింది. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం పెద్ద పోర్టుల అభివృద్ధి మాత్రమే కేంద్రం బాధ్య‌త అని తెలిపింది. రాజ్య‌స‌భ‌లో భార‌తీయ జ‌న‌తాపార్టీ ఎంపీ టీజీ వెంక‌టేష్ అడిగిన ప్ర‌శ్న‌కు పై విధంగా స‌మాధానం ల‌భించింది. కేంద్ర ఓడ‌రేవులు, నౌకాయాన‌శాఖ మంత్రి మ‌న్‌సుఖ్ మాండ‌వీయ లిఖిత‌పూర్వ‌కంగా తెలిపారు. రామాయ‌ప‌ట్నం పెద్ద‌పోర్టు కాద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే తెలిపింద‌ని, పెద్దవి కాని పోర్టుల బాధ్య‌త రాష్ట్రాల‌పైనే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఒక‌వేళ దీన్ని కేంద్రం అభివృద్ధి చేయాలంటే చ‌ట్టంలో మార్పులు చేయాల‌ని మంత్రి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: