మ‌హారాష్ట్ర‌లో క‌రోనా విజృంభిస్తోంది. ముంబ‌యిలో కేసుల సంఖ్య 11,141కి చేరుకోవ‌డంతో అక్క‌డ పాక్షిక లాక్ డౌన్ విధించే దిశ‌గా ప్ర‌భుత్వం స‌మాలోచ‌న‌లు చేస్తోంది. 10 రోజుల్లోగా క‌రోనా న‌గ‌రంలో అదుపులోకి రాక‌పోతే లాక్ డౌన్ విధించ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధ‌ప‌డుతోంది. ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్‌ఠాక్రే అధ్య‌క్షత‌న ఈరోజు జ‌రిగిన క్యాబినెట్ స‌మావేశంలో దీనిపైనే చ‌ర్చ జ‌రిగింది. మాస్క్ ధ‌రించిన‌వారిపై, ప‌బ్బుల్లో, వేడుక‌ల్లో గుమికూడ‌కుండా జ‌రిమానాలు విధించ‌డంలాంటి క‌రోనా నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని, సంస్థాగ‌త క్వారంటైన్‌, సాధ్య‌మైనంత ఎక్కువ‌మందికి క‌రోనా టీకా అందించ‌డంలాంటివి చేస్తున్నామ‌ని మంత్రి అస్లాంషేక్ తెలిపారు. అయినా కేసుల్లో పెరుగుద‌ల ఉంటేమాత్రం పాక్షిక లాక్‌డౌన్ త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని మంత్రి అభిప్రాయ‌ప‌డ్డారు. రాష్ట్రంలో క‌రోనా ఇలాగే విజృంభిస్తే ఏప్రిల్ నెలాఖ‌రుకు కేసుల సంఖ్య రెండు ల‌క్ష‌ల‌కు చేరుకునే అవ‌కాశ‌ముంద‌ని నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: