బ్యాంకు లావాదేవీలు చేసేటప్పుడు, ఇతర అనేక రకాల కార్యకలాపాలకు మన స్మార్ట్ ఫోన్ల‌కు ఓటీపీ, మోసేజ్‌లు రావ‌డం కామ‌న్‌. అయితే ఆదివారం అర్ధ‌రాత్రి నుంచి ఇవి బంద్ అయ్యాయి. చాలా మందికి మెసేజ్‌లు, ఓటీపీలు రావడం లేదు. దీనికి ప్రధాన కారణం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నియమ నిబంధనలు అందుబాటులోకి తీసుకురావడం. దీనివ‌ల్ల ఓటీపీలు, ఎస్ఎంఎస్‌ల‌కు కొద్ది రోజుల పాటు అవ‌రోధం క‌ల‌గ‌నుంది.

ఈ క్ర‌మంలోనే బ్యాంకులు వినియోగ‌దారుల సేవ‌ల‌కు ఇబ్బంది లేకుండా ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేశాయి. రెండు రోజుల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యే అవకాశం ఉంది.కీలకమైన లావాదేవీలు నిర్వహించడం కోసం ఈ ఓటీపీలు తప్పనిసరి అయినప్పటికీ.. కొత్త నియమాల వల్ల స్పామ్ చాలావరకు తగ్గిపోతుంది కాబట్టి తాత్కాలికంగా కలిగిన అసౌకర్యాన్ని భరించక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: