విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీని ప్రైవేటీక‌ర‌ణ చేయ‌డాన్ని నిర‌సిస్తూ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన మంత్రి గంటా శ్రీనివాస‌రావు మ‌రో సారి త‌న ప‌ద‌విపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే ఆయన రెండు సార్లు త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. తన రాజీనామాను వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఆమోదింప చేసుకుంటానని టీడీపీ ఎమ్మెల్యే గంటా తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ తప్పదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిందన్నారు.

ఈ  స‌మ‌యంలోనే జ‌గ‌న్ ముఖ్య‌పాత్ర పోషించ‌డంతో పాటు.. అన్ని పార్టీల‌ను క‌లుపుకుని వెళుతూ ఉద్య‌మం చేయాల‌న్నారు. ఇక ఇప్పుడు స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోలేక‌పోతే ఇక ఎప్ప‌ట‌కీ కాపాడుకోలేమ‌న్నారు. అన్ని పార్టీలూ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరకణకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఐక్యంగా ముందుకు రావడం లేదని గంటా శ్రీనివాసరావు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: