విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డితో మాట్లాడిన త‌ర్వాతే ముందుకు వెళుతోంద‌ని మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి ఆరోపించారు. ఉక్కు క‌ర్మాగారం ప్ర‌యివేటీక‌ర‌ణ ఒప్పందంలో వైసీపీ నేత‌లు కూడా భాగ‌స్వాముల‌య్యార‌ని, ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టాల‌ని చూడ‌టం మంచి ప‌ద్ద‌తి కాద‌ని హిత‌వు ప‌లికారు. విశాఖ ఉక్కుపై ముందుకు వెళుతున్నామంటూ కేంద్రం ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో కార్మికుల ఆందోళ‌న‌లు ఉధృత‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో మీడియాతో మాట్లాడిన స‌బ్బం హ‌రి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి, ఎంపీ విజ‌యసాయిరెడ్డి ప్ర‌జ‌ల‌కు అబ్దాలు చెపుతున్నార‌ని, కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డేయ‌మ‌ని కేంద్రంతో బేరాలాడ‌ట‌మే వారికి స‌రిపోతోంద‌ని మండిప‌డ్డారు. పోస్కో పై ఒడిసా ముఖ్య‌మంత్రి ఒప్పుకోలేద‌ని, ఇక్క‌డి ముఖ్య‌మంత్రి ఒప్పుకోవ‌డంతోనే కేంద్రం అడుగులు ముందుకు వేసింద‌ని తెలిపారు. పోస్కో ఇక్క‌డ‌కు రావాలంటే ఉద్య‌మాన్ని అణ‌చివేయాల‌ని, అందుకు పోలీసుల‌ను ఉప‌యోగించుకుంటున్నార‌ని విమ‌ర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: