ఆంధ్రప్రదేశ్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతుంది. రాజకీయంగా ఇప్పుడు విపక్షాలు కేంద్రంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఏపీ సర్కార్ కూడా ఇందుకు సహకరిస్తుంది అనే ఆరోపణలు ఉన్నాయి. ఇక స్టీల్ ప్లాంట్ విషయంలో టీడీపీ ఎలాంటి వైఖరితో ముందుకు వెళ్తుంది అనేది ఆసక్తిగా మారింది. ఈ నేపధ్యంలో కొన్ని వార్తలు రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తున్నాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేసే అవకాశం ఉండవచ్చు అని సమాచారం. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంపీలతో చర్చలు జరిపారని రాజ్యసభ ఎంపీ మినహా మిగిలిన ముగ్గురు ఎంపీలు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. శ్రీకాకుళం ఎంపీ  రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, కేశినేని నానీ రాజీనామాలను సమర్పించే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: