ఏపీ లో పరిషత్ ఎన్నికల నిర్వహణలో పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేశారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిది వర్ల రామయ్య , అలాగే జనసేన పార్టీ నేతలు వేర్వేరుగా సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్ కు సంబంధించి నేడు విచారణ జరగవలసి ఉండగా.. హైకోర్టు దాఖలైన పిటిషన్లను పరిశీలించిన తరువాత ఈ నెల 19న విచారణ చేపడతామంటూ వాయిదా వేసింది దర్మాసనం.

కాగా ఎం‌పి‌టి‌సి, జెడ్పీటీసీ ఎన్నికలను మొదట సింగిల్ జడ్జ్ వాయిదా వేసినప్పటికి డివిజన్ బెంచ్ మాత్రం ఏప్రెల్ 8 వ తేదీన ఎన్నికలు యదాతథంగా జరిగే విధంగా తీర్పు ఇవ్వడంతో రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు పూర్తి అయ్యాయి. అయితే ఫలితాలను మాత్రం కోర్ట్ నుండి ఆదేశాలు వచ్చే వరకు వెల్లడించవద్దని హైకోర్ట్ సూచించిన సంగతి తెలిసిందే.  దాఖలు చేశారు. .

మరింత సమాచారం తెలుసుకోండి: