ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల సాక్షి మీడియాపై సీరియ‌స్ అయ్యారు. తెలంగాణ‌లో ఆమె పార్టీ ఏర్పాటు చేస్తోన్న విష‌యం తెలిసిందే. వైఎస్ అభిమానులతో ఆమె కొన్ని రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో ష‌ర్మిల దీక్షకు దిగిన సందర్భంగా సాక్షి మీడియాపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. లైవ్ లో ఉండ‌గానే సాక్షి క‌వ‌రేజ్ మాకొద్ద‌ని.. మీరు వెళ్లిపోండ‌ని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న‌వారంతా అవాక్క‌య్యారు. మీరెలాగూ మాకు క‌వ‌రేజ్ ఇవ్వ‌రు.. వెళ్లిపోవాల‌ని కెమెరామెన్ కు ష‌ర్మిల చెప్పారు. ప‌క్క‌నే ఉన్న విజ‌య‌మ్మ షర్మిలను వారించారు. షర్మిల చేసిన కామెంట్స్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మరోవైపు నిరుద్యోగులకు మద్దతుగా ఇందిరాపార్క్‌లో షర్మిల 72 గంటలపాటు దీక్షకు దిగారు. నోటిఫికేష‌న్లు లేక నిరుద్యోగులు బ‌ల‌వ‌న్మర‌ణానికి పాల్పడుతుంటే దున్నపోతు మీద వాన ప‌డిన‌ట్లు సీఎం కేసీఆర్ తీరు ఉంద‌ని వైఎస్ ష‌ర్మిల తీవ్ర విమ‌ర్శలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr