ఆన్‌లైన్‌లో రుణాలిస్తూ వినియోగ‌దారుల‌ను వేధిస్తోన్న యాప్‌ల‌పై ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచార‌ణ‌లు ముగిశాయి. రుణాలిచ్చే యాప్‌ల‌పై 59 కేసుల‌ను న‌మోదు చేసిన‌ట్లు తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి హైకోర్టుకు నివేదిక స‌మ‌ర్పించారు. రుణాల కోసం వినియోగ‌దారుల‌ను వేధిస్తోన్న 118 మొబైల్ నెంబ‌ర్ల‌ను గుర్తించామ‌ని, 290 యాప్ ల‌ను బ్లాక్ చేశామ‌ని కోర్టుకు వెల్ల‌డించారు. ఈ వ్య‌వ‌హారంలో భార‌త్‌, చైనా, ఇత‌ర దేశాల‌కు చెందిన కొంద‌రి ప్ర‌మేయం ఉంద‌ని, వారంద‌రి వివ‌రాలు సేక‌రిస్తున్నామ‌ని, రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమ‌తిలేని రెండు ఎన్ఎఫ్ బీఐల‌ను గుర్తించామ‌ని వివ‌రించారు. ఇచ్చిన రుణానికి అత్య‌ధిక వ‌డ్డీని వ‌సూలు చేస్తున్నార‌ని, వినియోగ‌దారుల‌కు ప‌దే ప‌దే ఫోన్లు చేస్తూ వేధింపుల‌కు గురిచేస్తున్నార‌మ‌ని డీజీపీ తెలిపారు. అనుమ‌తి లేని ఎన్ ఎఫ్‌బీఐల‌పై ఏం చ‌ర్య‌లు తీసుకున్నార‌ని హైకోర్టు ప్ర‌శ్నించ‌గా పూర్తిస్థాయి ద‌ర్యాప్తు జ‌రుగుతోంద‌ని వెల్ల‌డించారు. అన్ని వివ‌రాల‌తో నాలుగు వారాల్లోగా నివేదిక స‌మ‌ర్పించాల‌ని డీజీపీని హైకోర్టు ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: