దేశంలో కొవిడ్‌ కేసులు తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుండ‌టంతో విదేశీ టీకాలకు అనుమతులిచ్చే విషయంలో కేంద్ర ప్ర‌భుత్వం విప్లవాత్మక మార్పును తెచ్చింది. దీంతో అమెరికా, ఐరోపా, యూకే, జపాన్‌తోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ జాబితాలో అనుమతులు పొందిన టీకాలు భారత్‌లో అడుగుపెట్టడం మరింత సులభంగా మారింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుద‌ల చేసింది. ఈ విష‌యాన్ని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఆయా విదేశీ టీకా సంస్థలు భారత అనుబంధ సంస్థలు లేదా స్థానికంగా గుర్తింపు పొందిన ఏజెంట్‌ ద్వారా సీడీఎస్‌సీవోకు దరఖాస్తు చేసుకోవాలి. పరిమితులతో కూడిన అత్యవసర వినియోగానికి పనికివస్తుందేమో సీడీఎస్‌సీవో పరిశీలించి 3 రోజుల్లో నిర్ణయాన్ని వెల్లడించాలి. దాని ఆధారంగా ఆ తర్వాత డీసీజీఐ అనుమతులు మంజూరు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: