క‌రోనా ఉధృతంగా వ్యాపిస్తుండ‌టంతో తెలంగాణ వైద్య‌శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాస్పత్రుల్లో అదనంగా 25శాతం బెడ్లు పెంచాలని నిర్ణయించారు. కరోనా రోగులను ఆస్పత్రుల్లో చేర్చేందుకు ప్రత్యేక ప్రోటోకాల్ ఏర్పాటు చేశారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఎలెక్టీవ్ ఆపరేషన్లను పోస్ట్‌పోన్ చేయాలని, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మరిన్ని బెడ్లు పెంచాలని రాష్ట్ర వైద్యశాఖ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ‌లో క‌రోనా రెండోద‌శ‌లో రోజురోజుకు పెరుగుతోంది. మ‌హ‌మ్మారి బారిన‌ప‌డుతున్న‌వారి సంఖ్య పెరుగుతుండ‌టంతో ప్ర‌భుత్వాస్ప‌త్రుల్లో బెడ్లు సరిపోవ‌డంలేదు. పొరుగున ఉన్న మ‌హారాష్ట్ర‌లో న‌మోద‌వుతున్న కేసుల సంఖ్య దేశ‌వ్యాప్తంగా న‌మోద‌వుతున్న కేసుల సంఖ్య‌లో 65 శాతం వ‌ర‌కు ఉన్నాయి. అక్క‌డి రోగులంతా చికిత్స కోసం హైద‌రాబాద్‌కు త‌ర‌లివ‌స్తున్నారు. దీంతో ప్ర‌భుత్వాస్ప‌త్రుల‌తోపాటు ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల్లో కూడా బెడ్ల‌కు కొర‌త ఏర్ప‌డుతోంది. దేశ‌వ్యాప్తంగా సెలెబ్రిటీలంద‌రూ త‌మ త‌మ ప్రాంతాల్లో ముందుగానే బెడ్లు బుక్ చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: