బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 6.21 లక్షల క‌రోనా వ్యాక్సిన్లు ఇచ్చామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, పీహెచ్‌సీల సిబ్బంది అందరూ సమష్టిగా పని చేయడంవల్లే ఇది సాధ్యమైందన్నారు. రోజుకు 6 లక్షల వాక్సిన్లు ఇవ్వాలన్న లక్ష్యాన్ని సాధించామని, మున్ముందు కూడా అలాగే చేయాలన్నారు. ప్రస్తుతం వాక్సిన్లు లేక‌పోవ‌డంతో వాటి కోసం కేంద్రానికి లేఖ రాయమని అధికారులకు సూచించారు. అవసర‌మైతే తాను కూడా లేఖ రాస్తానని చెప్పారు. కోవిడ్‌ నివారణ, కరోనా వాక్సిన్‌పై తాడేప‌ల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఎవరికైనా చికిత్స, బెడ్‌ కావాలంటే 104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌చేయాల‌ని, అంబులెన్సు సదుపాయం ఏర్పాటు చేయడంతో పాటు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల సహాయంతో రోగికి వేగంగా వైద్య సేవలందించాల‌న్నారు. రోగి ఫోన్‌ చేసిన మూడు గంటల్లోగా ఆస్పత్రిలో బెడ్‌ సమకూర్చాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: