ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లోనే 5086 కేసులు న‌మోద‌య్యాయి. 14 మంది మ‌హమ్మారి బారిన ప‌డి మృత్యువాత ప‌డ్డారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఐదుగురు మృతిచెంద‌గా, విశాఖ‌ప‌ట్నం, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లో ఇద్ద‌రు చొప్పున, కృష్ణా, గుంటూరు, క‌డ‌ప జిల్లాల్లో ఒక్కొక్క‌రు మ‌ర‌ణించారు. దాదాపు 36 వేల‌మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో 9 ల‌క్ష‌ల 42 వేల‌మంది వైర‌స్ బారిన ప‌డ‌గా మృతిచెందిన‌వారి సంఖ్య 7353కి చేరింది. చిత్తూరు జిల్లాల్లో అత్య‌ధికంగా 617 కేసులు న‌మోద‌య్యాయి. రాష్ట్రంలో మ‌రోవైపు వ్యాక్సిన్ల కొర‌త వేధిస్తోంది. తాడేప‌ల్లిలోని క్యాంప్ కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ టీకాల కోసం కేంద్రానికి లేఖ రాయాలంటూ అధికారుల‌ను ఆదేశించారు. అవ‌స‌ర‌మైతే తాను కూడా లేఖ రాస్తాన‌న్నారు. 104 కాల్ సెంట‌ర్‌కు ఫోన్ చేసిన రోగికి మూడుగంట‌ల్లోగా ఆస్ప‌త్రిలో బెడ్ ఏర్పాటు చేయాల‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: