తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతరూపం దాలుస్తుండటంతో ప‌దో త‌ర‌గ‌తి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ‌తేడాది లాగానే ఈ ఏడాది కూడా రాష్ట్రంలో 10వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు ర‌ద్దుచేసింది. సీబీఎస్ఈ పరీక్షలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా పున‌రాలోచ‌న చేసింది. విద్యార్థుల త‌ల్లిదండ్రులు, పార్టీల నేత‌ల‌తో మాట్లాడి చివ‌ర‌కు ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ర‌ద్దుచేసింది. గతేడాదిలానే ఇంటర్నల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాన్ని లెక్కించి మార్కులు కేటాయిస్తారు. కరోనా ప్రభావం మరో రెండు నెలల వరకు తగ్గే అవకాశాల్లేవని, వచ్చే నాలుగు వారాలు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ చేసిన సూచ‌న మేర‌కు ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. మే 1 నుంచి ఇంటర్ ఫస్టియర్, రెండో తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డు గతంలోనే షెడ్యూల్ విడుదల చేసింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే తప్ప పరీక్షల వాయిదాపై తాము నిర్ణయం తీసుకోలేమని, ప్రస్తుతం పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై దృష్టి పెట్టామని ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: