తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో టెన్త్ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం..తాజాగా ఇంటర్ పరీక్షలకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను ప్రమోట్ చేసింది. దీంతో ఫస్టియర్ విద్యార్థులు ఎటువంటి పరీక్షలు లేకుండానే నేరుగా సెకండియర్ లో అడుగు పెట్టనున్నారు. ఇక సెకండియర్ పరీక్షలను వాయిదా వేసింది. రాష్ట్రంలో కరోనా ఉదృతి తగ్గిన తరువాత ఇంటర్ సెకండియర్ పరీక్షలపై నిర్ణయం తీసుకొనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఎంసెట్ లో ఇంటర్ ఫస్టియర్ కు సంబంధించిన 25 శాతం వెయిటేజ్ ను పరిగణలోనికి తీసుకోవడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: