తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ఆరోపించారు. దీనిపై సీఐడీ విచారణకు ఆదేశించనున్నట్టు  పేర్కొన్నారు. కుచ్‌బేహార్‌ కాల్పుల్లో చనిపోయిన వారి మృతదేహాలతో ర్యాలీ నిర్వహించాలంటూ.. సీఎం మమత చెబుతున్నట్టు ఓ ఆడియో బయటికి వచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత‌రోజే మ‌మ‌తా ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం గమనార్హం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గాల్సీలో జరిగిన ఓ బహిరంగ సభలో దీదీ మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాల ఆధారంగా తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని ఎదుర్కోలేక బీజేపీ ఈ తరహా కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇంట్లో వంట చేసుకునే కబుర్లు మొదలు మేము ఫోన్ ద్వారా మాట్లాడుకునే విషయాలన్నీ వారు ట్యాపింగ్ చేస్తున్నారు. కొంతమంది ఏజెంట్లతో కుమ్మక్కై కేంద్ర బలగాలే ఇలాంటి పనులు చేస్తున్నట్టు సమాచారం ఉంది.కుచ్‌బేహార్‌కు సంబంధించి  లాంటి సంభాషణ ఏదీ జరగలేదనీ.. ఇదంతా బీజేపీ ఆడుతున్న నాట‌క‌మంటూ తృణ‌మూల్ నేతలు ఖండించారు. ముఖ్యమంత్రి ఫోన్‌ని కేంద్రం ట్యాప్ చేయ‌డంపై ఆ పార్టీ నేత‌లు విస్మ‌యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: