తిరుప‌తి లోక్‌స‌భ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో తిరుప‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధికి తిరిగి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడు డిమాండ్ చేశారు. కేంద్ర బ‌ల‌గాల ఆధ్వ‌ర్యంలో ఎన్నిక‌లు జ‌రిపించాల‌ని కోరుతూ ఈరోజు సీఈసీకి లేఖ రాశారు. స్థానికేత‌రుడైన మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి తిరుప‌తిలో ఏం ప‌ని ఉంద‌ని, ఎన్నిక‌లు జ‌రుగుతుంటే బ‌య‌టివారికి ఎలా అనుమ‌తిచ్చారంటూ చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. మంత్రిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, దొంగ ఓట్లు వేస్తున్నారంటూ తెలుగుదేశం శ్రేణులు ప‌ట్టిస్తే తిరిగి మావారిపైనే కేసులు పెట్టార‌ని లేఖ‌లో పేర్కొన్నారు. వారిని త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని కోరారు. ఈరోజు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌జాస్వామ్యం అప‌హాస్యం పాలైంద‌ని, వేల‌సంఖ్య‌లో దొంగ ఓట్లు పోల‌య్యాయ‌ని, అక్ర‌మాల‌ను అరిక‌ట్ట‌డంలో పోలీసులు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని విమ‌ర్శించారు. అక్ర‌మాల‌కు సంబంధించిన వీడియోని, ఫొటోల‌ను చంద్ర‌బాబు లేఖ‌కు జ‌త‌చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: