భార‌త్‌లో అక్టోబర్‌లో జరిగే ఐసీసీ వరల్డ్ క‌ప్ క్రికెట్‌ టీ20 పై అదిరిపోయే న్యూస్ వ‌చ్చింది. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనే విష‌యంలో పాకిస్తాన్ జ‌ట్టు ఆట‌గాళ్ల‌కు వీసా వ‌స్తుందా ?  రాదా ? అన్న స‌స్పెన్స్‌కు ఎట్ట‌కేల‌కు తెర‌ప‌డింది. దాయాది దేశం నుంచి ఆటగాళ్లు ఇక్కడికి ప్రయాణించేందుకు వీలుగా ప్రభుత్వం వీసాలు మంజూరు చేయనుంది. అయితే మ్యాచ్‌లు చూడడానికి అభిమానులు సరిహద్దులు దాటి వచ్చేందుకు అనుమతించడంపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై కూడా త్వ‌ర‌లోనే భార‌త ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోనుంది.

ఇరు దేశాల మ‌ధ్య ఉన్న రాజ‌కీయ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో భార‌త్ - పాక్ జ‌ట్ల మ‌ధ్య ద్వైపాకిక్ష సీరిస్‌లు జ‌ర‌గ‌డం లేదు. ఇక వరల్డ్ టీ20 కోసం బీసీసీఐ ఇప్పటికే తొమ్మిది వేదికలను సిద్ధం చేసింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ తదితర మైదానాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: