తెలంగాణ‌లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో ఓటర్లు పోటెత్తారు. ఉప ఎన్నిక అయినా కూడా ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు భారీ స్థాయిలో ఓట‌ర్లు క్యూ లైన్ల‌లో ఉన్నారు. ఓట‌ర్లు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. 82 శాతం ఓటింగ్ నమోదయింది. కరోనా ఉన్నప్పటికీ ఎక్కువ సంఖ్యలో పోలింగ్ లో ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వల్లనే పోలింగ్ శాతం పెరిగిందని విపక్షాలు చెబుతున్నాయి. అయితే పోలింగ్ శాతం పెరగడం తమకు అనుకూలంగా మారనుందని అధికార టీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. మ‌రి ఈ పోరులో ఎవ‌రు విజేత అవుతారో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: