ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. ఈ క్ర‌మంలోనే మ‌న దేశంలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతుండటంతో మ‌రోసారి లాక్ డౌన్ త‌ప్ప‌దా ? అన్న చ‌ర్చ‌లు తీవ్రంగా న‌డుస్తున్నాయి. మ‌రోసారి లాక్ డౌన్ ఉండ‌ద‌ని చెపుతున్నా ఏం జ‌రుగుతుందో ?  కూడా ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. ఇదిలా ఉంటే క‌రోనా తీవ్ర‌త నేప‌థ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అప్రమత్తమయ్యారు.

క‌రోనా తీవ్ర‌త‌ను ఎలా క‌ట్ట‌డి చేయాల‌న్న అంశంపై ఆయ‌న ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షించారు. ఈ క్ర‌మంలోనే దేశ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ పెడితే ఎలా ఉంటుందన్న దానిపై అధికారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. దీంతో పాటు అనేక రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత, బెడ్స్ కొరతపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ సమీక్షించారు. త్వరలోనే దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: