పసిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌... ఇంత‌కు మించిన బంప‌ర్ ఆఫ‌ర్ ఉండ‌ద‌నే చెప్పాలి.  బంగారం ధర మూడు నెలల కాలంలో భారీగా తగ్గింది.  బంగారం ధర తగ్గితే వెండి మాత్రం పైకి కదిలింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర జనవరి1న రూ.51,060 వద్ద ఉండేది. ఇప్పుడు ఇదే బంగారం ధర రూ.48 వేల వద్ద ఉంది. ఒకేసారి ఏకంగా రు. 3 వేలు త‌గ్గ‌డం ఇటీవ‌ల కాలంలో సంచ‌ల‌న‌మే.

ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.2,800 దిగొచ్చింది.బంగారం ధర పడిపోతే వెండి రేటు మాత్రం పైకి కదిలింది. గత మూడు నెలల కాలంలో వెండి రేటు పెరిగింది. జనవరి 1న కేజీ వెండి రేటు రూ.72,400 వద్ద ఉండేది. కానీ ఇప్పుడు వెండి రేటు రూ.73,400 వద్ద ఉంది. అంటే వెండి ధర ఈ కాలంలో రూ.1000 పైకి చేరింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: