హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలోని స్మ‌శాన వాటికల్లో కొవిడ్ మృతుల అంత్యక్రియలు ఆగిపోయాయి. దీంతో దహన సంస్కారాల కోసం గంటల తరబడి మృతుల బంధువులు వేచిస్తున్నారు. ఎర్రగడ్డ, బన్సీలాల్‌పేట్ శ్మశాన వాటికల్లో ఎలక్ట్రికల్ కిమిటోరియాలు పనిచేయకపోవడంతో క‌రోనా సోకి మ‌ర‌ణించిన‌వారి అంత్యక్రియలకు బ్రేక్ పడింది. గంటల తరబడి వేచివున్నా పట్టించుకోకపోవడంతో మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ‌తంలో కొవిడ్ మృతుల అంత్యక్రియల ఖర్చులు భరించిన గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఇప్పుడు వాటిని భరించడంలేదు. కొవిడ్ మృతుల బంధువులే ప్రస్తుతం ఆ ఖర్చుల‌ను భరిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ‌లో రోజురోజుకూ క‌రోనా కేసుల తీవ్ర‌త పెరుగుతోంది. రాష్ట్ర‌వ్యాప్తంగా న‌మోద‌వుతున్న కేసుల్లో ఎక్కువ శాతం హైద‌రాబాద్ న‌గ‌రం నుంచే వ‌స్తున్నాయి. ప్ర‌జ‌లు మాస్క్‌లు ధ‌రించాల‌ని, లేనిప‌క్షంలో రూ.వెయ్యి జ‌రిమానా విధించాలంటూ ప్ర‌భుత్వం ఇటీవ‌లే క‌లెక్ట‌ర్ల‌కు సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: