తెలంగాణ‌లో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ దీక్ష చేస్తున్న దివంగత ముఖ్య‌మంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె  షర్మిల ఆరోగ్యం క్షీణిస్తోంది. లోటస్‌పాండ్‌లో దీక్షను కొనసాగిస్తున్న షర్మిలను వైద్యులు పరీక్షించారు. 88 నుంచి 62కు షుగర్‌ లెవల్స్ తగ్గాయని, రెండు కిలోల బ‌రువు త‌గ్గార‌ని ప‌రీక్షించిన వైద్యులు తెలిపారు. ఉద్యోగాల నోటిఫికేషన్‌ జారీ చేయాలంటూ 72 గంటల దీక్ష చేస్తానని ప్రకటించిన షర్మిల.. గురువారం ఇందిరా పార్కు ధర్నాచౌక్‌ వద్ద ఈ దీక్ష ప్రారంభించారు. పోలీసులు సాయంత్రం వరకే అనుమతివ్వడం, ఆ తర్వాత ఆమె పాదయాత్రగా లోటస్‌పాండ్‌కు బయల్దేరడం.. మ‌ధ్య‌లో వివాదం.. త‌దిత‌ర విష‌యాల‌న్నీ తెలిసిందే. అయితే ష‌ర్మిల‌ మంచినీరు మాత్రమే తాగుతూ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్ద‌ని, తోడబుట్టిన అక్కగా మీ త‌ర‌ఫున తాను పోరాటం చేస్తాన‌ని ష‌ర్మిల ప్ర‌క‌టించారు. ఆటో యూనియన్‌ నేతలు   ఆటోలతో భారీ ర్యాలీగా వచ్చి షర్మిలకు మద్దతు ప్ర‌క‌టించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: