ప్రస్తుతం తెలంగాణ‌లో కరోనా వైరస్ ఉధృతంగా ఉన్న నేప‌థ్యంలో, భక్తుల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా ఈనెల 19వ తేదీ నుంచి 30వ తేదీ వ‌ర‌కు భ‌ద్రాచ‌లం అంతరాలయంలో జరిగే అన్ని పూజలు, సేవలు రద్దు చేస్తున్నట్లు ఈవో శివాజీ ప్రకటించారు. అలాగే ఏప్రిల్ 21, 22 తేదీల్లో జ‌రిగే శ్రీ రామనవమి వేడుకలకు భక్తులకు ఆలయ దర్శనాలు, పూజలు, అన్నదాన వితరణ ర‌ద్దుచేస్తున్నట్లు ఈవో తెలిపారు. భ‌క్తులెవ‌రూ భ‌ద్రాచ‌లం రావొద్ద‌ని, సాధ్య‌మైంత‌వ‌ర‌కు ఇళ్ల‌ల్లోనే రామ‌న‌వ‌మి జ‌రుపుకోవాల‌ని ఆయ‌న సూచించారు. రోజురోజుకు తెలంగాణ‌లో క‌రోనా ఉధృతంగా వ్యాపిస్తోంది. రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, వ‌స‌తిగృహాలు, కార్యాల‌యాలే క‌రోనాకు హాట్‌స్పాట్‌గా మారుతున్నాయి. ప్ర‌జ‌లు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్ద‌ని, మాస్క్ లేక‌పోతే వెయ్యిరూపాయ‌లు జ‌రిమానా విధించాల‌ని ప్ర‌భుత్వం క‌లెక్ట‌ర్ల‌కు సూచించింది. తెలంగాణ‌లో రోజువారీ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న నేప‌థ్యంలోనే ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను కూడా ప్ర‌భుత్వం ర‌ద్దుచేసింది. ఇంట‌ర్ ద్వితీయ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: