ఒక్క రూపాయి పంచకుండా.. మద్యం ఇవ్వకుండా.. తిరుపతి లోక్‌స‌భ‌ ఉపఎన్నికలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి కొత్త సంప్రదాయానికి తెరలేపారని న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్‌.కె.రోజా అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. జగన్ త‌న పాలనతో, సంక్షేమ పథకాలతో ఓటర్ల మనసు గెలిచారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ నేత‌లు ఓడిపోతామ‌నే భయంతోనే దొంగ ఓట్లు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఇలాంటి ప్రచారంతో వైసీపీ ప్రతిష్ట ఏ మాత్రం దిగజారదన్నారు. తెలుగుదేశం పార్టీ నేత‌లు రోడ్లపై డ్రామాను క్రియేట్‌ చేశారని, జిల్లాకు పెద్ద అయిన పెద్దిరెడ్డిపై కక్షసాధింపునకు పాల్పడ్డారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దొంగ ఓటర్లను పోలింగ్ బూత్‌ల్లో ఎందుకు పట్టుకోలేదని రోజా ప్రశ్నించారు. తిరుప‌తిలో మంత్రి పెద్దిరెడ్డికి చెందిన క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో దొంగ ఓట‌ర్లున్నార‌ని, న‌కిలీ ఓట‌రు ఐడీకార్డుల‌తో వారంతా ఓట్లు వేస్తున్నారంటూ ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ వీడియో ఆధారాల‌తో స‌హా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాసింది. దాదాపు అన్ని టీవీ ఛాన‌ల్స్ తిరుప‌తిలో జ‌రిగిన త‌తంగాన్ని లైవ్‌లో చూపించాయి. జ‌బ‌ర్ద‌స్త్‌ జ‌డ్జిగా ఉండ‌టంవ‌ల్ల రోజాపై ఆ ప్ర‌భావం ఉంద‌ని, తిరుప‌తిలో ఆమె మాట్లాడిన మాట‌లు ఫుల్లు కామెడీగా ఉన్నాయంటూ తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు న‌వ్వుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: