ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చేవరకు త‌మ ఆందోళన కొనసాగుతుందని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. అంతే కాకుండా ఈ విషయమై రేపటి నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు వెల్ల‌డించారు. ఆదివారం హైదరాబాద్‌లోని లోట‌స్‌పాండ్‌లో ష‌ర్మిల‌ మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు అందరూ అండగా నిలబడాలని, ఈ ఆందోళనలకు తాను హాజరు కాలేకపోవచ్చని, కోవిడ్ దృష్ట్యా ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. అందరూ కలిసి రావాలని, తెలంగాణ‌లో ఇక భ‌విష్య‌త్ తమదేనన్నారు. తమతోపాటు ఇప్ప‌టినుంచే క‌ష్ట‌ప‌డుతున్న ప్ర‌తి నాయ‌కుడికి, కార్య‌కర్త‌కు భ‌విష్య‌త్తులో స‌ముచిత స్థానం ఉంటుందని షర్మిల హామీ ఇచ్చారు. ఆరోగ్యం క్షీణిస్తుండ‌టంతో ఈరోజే ష‌ర్మిల మూడురోజుల దీక్ష‌ను ముగించారు. ఆమె రెండు కేజీల బ‌రువు త‌గ్గ‌డంతోపాటు షుగ‌ర్ లెవ‌ల్స్ కూడా ప‌డిపోవ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: