క‌రోనా వైర‌స్ సెకండ్‌ వేవ్‌ నానాటికీ విజృంభిస్తోంది. మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రతిరోజు రికార్డు స్థాయిలో కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.  అత్యంత వేగంగా విస్త‌రిస్తున్న ఈ వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు..ఇప్పటికే కరోనా కట్టడికై పలు రాష్ట్రాలు వీకెండ్ లాక్‌డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. అయినా కూడా పరిస్ధితి అదుపులోకి రావటంలేదు.

ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో కరోనా ఉధృతి వేగంగా పెరుగుతుండటంతో పలు దేశాలు భారత్కు విమాన రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్ప‌టికే హాంకాంగ్, యూకే ఆంక్ష‌లు విధించ‌గా.. ఇప్పుడు అగ్ర రాజ్యం అమెరికా సైతం భార‌త ప్ర‌యాణికుల‌పై ఆంక్ష‌లు విధించింది. తాజాగా అగ్రరాజ్యం అమెరికా కూడా భారత ప్రయాణ రాకపోకలపై పలు సూచనలు చేసింది. కొద్ది రోజుల పాటు భారత్‌ పర్యటనకు దూరంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌(సీడీసీ) ఓ ప్రకటనలో తెలిపింది. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే ప్రయాణానికి ముందు వ్యాక్సిన్‌ తీసుకుని వెళ్లాలని కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: