ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన జోనల్‌ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 371డీలోని (1) (2) క్లాజ్‌లపై ఉన్న అధికారాల మేర‌కు తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆర్డర్‌-2018కి కేంద్రం ఓకే చెప్పింది. పోలీసు శాఖ‌ మినహా అన్ని విభాగాలకూ కొత్త జోన్ల విధానం వ‌ర్తించనుంది. ఆర్డర్‌-2018కి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర హోంశాఖ సోమవారం రాత్రి జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది. పోలీసు మినహాయించి మిగిలిన అన్ని విభాగాలకూ ఈ జోన్ల విధానం వర్తిసుందని తెలిపింది. కొత్త జోనల్‌ విధానంతో ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమం కానుంది. మ‌రోవైపు కొత్త జోన‌ల్ విధానంతో విద్యా, ఉద్యోగ అవ‌కాశాల్లో ప్ర‌జ‌ల‌ద‌రికీ విస్తృత‌మైన‌, స‌మాన అవ‌కాశాలు ద‌క్క‌నున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: