లోట్‌సపాండ్‌ కార్యాలయం వద్ద వైఎస్‌ షర్మిల దీక్ష నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్న డిమాండ్‌తో .. షర్మిల ఈ దీక్ష నిర్వహించింది. ఇది ఇలా ఉండగా.. ఆదివారం దీక్ష విరమణ అనంతరం.. షర్మిల మద్దతుదారులు కొందరు కరోనా పరీక్షలు చేయించుకొగా.. పరీక్షల్లో షర్మిల ముఖ్య అనుచరుడు పిట్టా రాంరెడ్డి కి కరోనా పాజిటివ్ గా తేలింది.అంతేకాదు పిట్టా రాంరెడ్డితోపాటు మరో ఇద్దరికి కూడా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఈ దీక్షలో పాల్గోన నేతలకు కరోనా భయం పట్టుకుంది. షర్మిల సహా ముఖ్యనేతలు.. ప్రైమరీ కాంటాక్టు కావడంతో వారం పాటు లోట్‌సపాండ్‌ కార్యాలయానికి సెలవు ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: