భారత్ లో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థలు 50 శాతం కేంద్రానికి ఇచ్చి మిగిలిన 50 శాతం రాష్ట్రాలు, బహిరంగ మార్కెట్లో అమ్ముకోవచ్చని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీరం సంస్థ తన వ్యాక్సిన్ డోస్ ధరను వెల్లడించింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను ప్రకటించింది సీరమ్ సంస్థ. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్క డోసు ధర రూ.400 గా ప్రైవేట్ కు రూ.600 గా నిర్ణయించింది. అయితే,కోవిషీల్డ్ డోసులకు సంబంధించి  రాష్ట్రాలకు అధిక ధరలను  నిర్ణయించడాన్నికాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు తప్పుపట్టాయి. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఒకే  ధర ఉండాలని డిమాండ్  చేశాయి. సీపీఎం  సీనియర్ నేత సీతారాం ఏచూరి ఈ ధరలను అంగీకరించబోమన్నారు. పీఎం కేర్స్ ఫండ్ లో ఉన్న లక్షల కోట్ల రూపాయలను ప్రధాని ఖర్చు చేయాలనీ, రాష్ట్రాలపై అధిక ధరలను మోపరాదని, సీరం సంస్థ నిర్ణయం వెనుక ఏవైనా అదృశ్య శక్తులు ఉన్నాయా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: