ఏపీలో కరోనా ఉదృతంగా విజృంభిస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రోజుకి పదుల సంఖ్యలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో మరణిస్తున్నారు. వేల సంఖ్యలో నమోదు అవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏపీ లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డ్ కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 9,716 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో 1,444, గుంటూరులో 1,236, చిత్తూరులో 1,180, కర్నూలు 958, నెల్లూరు 934, అనంతపురం 849, తూర్పు గోదావరి 830, విశాఖ 810, విజయనగరం 565, ప్రకాశం 294, పశ్చిమ గోదావరి 106, కడప 216, కృష్ణా 294 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 38 మంది మృతిచెందారు. కృష్ణా 10, నెల్లూరు 7, తూ.గో జిల్లా 4, శ్రీకాకుళం 4, చిత్తూరు 3, ప్రకాశం 3, గుంటూరు 2, కర్నూలు 2, విశాఖ 2, అనంతపురం లో 1 చొప్పున కరోనా మరణాలు సంభవించాయి. ఏపిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగి పోవడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: