దేశంలో కరోనా సెకండ్ వేవ్ భీబత్సం సృష్టిస్తుంది. ఇప్పటికే మన దేశంలో ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3 లక్షల 14 వేల 835 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. అటు మరణాలు కూడా రికార్డ్ స్థాయిలోనే బయటపన్నాయి. తెలంగాణాలో కూడా కొవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. హైదరాబాద్ లో కరోనా మరీ తీవ్రంగా ఉంది. ప్రముఖ ప్రభుత్వ వైద్యశాల గాంధీ ఆస్పత్రిలో ఐసియు బెడ్ లు అన్ని రోగులతో నిండిపోయాయని.. పరిస్ధితి చాలా భయానకంగా ఉంది అని పలువురు స్దానికుల నుండి వినిపిస్తున్న మాటలు. ఐసీయూ పడకలు రోగులతో నిండిపోవడంతో వెంటిలేటర్‌ అవసరమైన రోగులు అంబులెన్స్‌ల్లోనే గంటల తరబడి నిరీక్షించే పరిస్థితి నెలకొంది అని అంటున్నారు. అయితే , సికింద్రాబాద్‌ గాంధీఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత లేదని, ఇక్కడ 20 టన్నులు, 6 టన్నుల కెపాసిటీ కలిగిన రెండు లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు అందుబాటులో ఉన్నాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు చెబుతున్నారు. కాగా .. గాంధీలో మొత్తం 1850 పడకలు ఉండగా 500 ఐసీయూ (వెంటిలేటర్‌), 1250 ఆక్సిజన్‌ బెడ్ల కోసం కేటాయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: