మూడో దశ వ్యాక్సినేషన్ కు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పాలసీపై వివిధ రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం వైఖరి పట్ల కేరళ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఒక దేశం, ఒక పార్టీ, ఒక నాయకుడు అని చెప్పే బిజెపి.. ప్రజల ప్రాణాలను కాపాడటానికి అందించే వ్యాక్సిన్ కోసం మాత్రం ఒక ధర కేటాయించలేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.

ప్రతి భారతీయుడికి వయస్సు, కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా ఉచిత వ్యాక్సిన్ అవసరమని మమతా గుర్తు చేసారు. కోవిడ్ వ్యాక్సిన్ కోసం కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఒక ధరను నిర్ణయించాలని డిమాండ్ చేసారు. కరోనా కారణంగా రాష్ట్రాలపై ఇప్పటికే ఆర్థిక భారం ఉందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. రాష్ట్రాలను మరింత ఆర్థిక సంక్షోభానికి నెట్టే బదులు.. కేంద్రం ఉచితంగా రాష్ట్రాలకు టీకాలు ఇవ్వాలని విజయన్ డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: