క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో కరోనా మహమ్మారి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 5,567 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. మరో 23 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. ఇది ఇలా ఉండగా.. దేశంలో కోవిడ్‌ వ్యాక్సిన్ల ధరల వ్యత్యాసంపై తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ఫైర్ అయ్యారు.ఈ మేరకు ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో.. "ఒకే దేశంలో ఇప్పుడు వ్యాక్సిన్లకు 2 ధరలు చూస్తున్నాం. కేంద్రానికి రూ.150, రాష్ట్రాలకు రూ.400 టీకా అంటున్నారు. అదనపు ఖర్చుని కేంద్రం పీఎం కేర్స్‌ నిధి నుంచి భరించలేరా? దేశమంతా వ్యాక్సినేషన్‌ పూర్తికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందా? ఒకే దేశం ఒకే పన్ను కోసం జీఎస్టీని అంగీకరించాం" అని‌ ట్వీట్‌ పోస్ట్ చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: