క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో కరోనా మహమ్మారి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 5,567 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. మరో 23 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. హైదరాబాద్ లో కరోనా మరీ తీవ్రంగా ఉంది. ప్రముఖ ప్రభుత్వ వైద్యశాల గాంధీ ఆస్పత్రిలో ఐసియు బెడ్ లు అన్ని రోగులతో నిండిపోయాయని.. పరిస్ధితి చాలా భయానకంగా ఉంది అని పలువురు స్దానికుల నుండి వినిపిస్తున్న మాటలు. ఐసీయూ పడకలు రోగులతో నిండిపోవడంతో వెంటిలేటర్‌ అవసరమైన రోగులు అంబులెన్స్‌ల్లోనే గంటల తరబడి నిరీక్షించే పరిస్థితి నెలకొంది అని అంటున్నారు.

ఇక ప్రస్తుత కరోనా పరిస్ధితుల పై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌  మీడియా సమావేశం నిర్వహించారు.  మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "రాష్ట్రానికి 4లక్షల రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు ఆర్డర్‌ పెడితే కేవలం 21,550 మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సరికాదని  కరోనా వ్యాక్సిన్‌లాగే రెమిడెసివిర్‌ కూడా తమ అధీనంలోనే ఉండేలా కేంద్రం నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తయ్యే రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను తమకే కేటాయించాలని" ఈటల కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: