ఈ కరోనా ఏమో గాని చాలా మంది హైదరాబాద్ లో ఉండాలి అంటే భయపడే పరిస్థితి వలస కూలీలకు వచ్చింది. లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని అందరూ భయపడుతూ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. స్వస్థలాలకు వలస కార్మికులు వెళ్ళిపోతున్నారు. గత వారం రోజుల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిందంటోన్న ఎంజిబీఎస్ అధికారులు... అందుకు తగిన విధంగా చర్యలు చేపట్టామని చెప్తున్నారు.

రాత్రి వేళ కర్ఫ్యూ విధించిన తర్వాత బస్ సర్వీసులను టీఎస్ ఆర్టీసీ అధికారులుపెంచారు. గత రెండు రోజుల్లో ఎంజిబీఎస్ నుంచి జిల్లాలకు రెట్టింపు ప్రయాణికులు వెళ్ళారు. పక్క రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, మహరాష్ట్రలకు ఎక్కువ సంఖ్యలో వలస కార్మికులు వెళ్ళిపోయారు. తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి మెదక్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు హైద్రాబాద్ నుంచి వలస కార్మికులువెళ్ళిపోయారు. సొంత ప్రాంతాలకు తరలిపోతోన్న వారిలో నిర్మాణరంగం, ఉత్పత్తి రంగాల్లో పనిచేస్తోన్న వారే అధికంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: