ప్రస్తుతం కరోనా మన దేశాన్ని ఎలా పట్టి పీడిస్తుందో మనకు తెలిసిందే. ఇంటి నుండి బయటకి రావడానికే ప్రజలు భయపడుతున్నారు. ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప.. ఇంట్లో నుండి కాళ్లు బయటకి పెట్టకపోవడమే మంచిది.. ఒక్కవేళ ఏదైనా పని మీద వెళ్లాలి అనుకున్న .. ఖచ్చితంగా మాస్క్ వేసుకుని తగ్గిన జాగ్రత్తలు తీసుకుని వెళ్తున్నారు. ఇక..మధ్యప్రదేశ్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ కోసం ఓ గ్రామస్థులు వినూత్న ప్రదర్శన చేసారు. అగర్‌మల్వా జిల్లాలోని గణేష్‌పుర గ్రామవాసులు కొవిడ్‌ను పోవాలంటూ.. దీపాలు పట్టుకుని వీధుల్లో పరిగెత్తుతూ.. ‘భాగ్‌ కరోనా భాగ్‌’ అని నినాదాలు చేస్తూ.. ఆ తరువాత  పొలిమేరలకు వెళ్లి దీపాల్ని గ్రామం బయట పడేలా గాల్లోకి విసిరేశారు. ఇలా చేయడం ద్వారా కరోనా తమ గ్రామం నుంచి వెళ్లిపోతుందని వారు నమ్ముతున్నారు.  ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: