దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.  ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రతి రోజు రికార్డ్ స్దాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవ్వడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులకు అనుగుణంగా పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఈ అంశంపై మరోసారి సమీక్ష తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని తదుపరి నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు.. పలు పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: