దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తోన్న వేళ ప్రధాని నరేంద్రమోదీ కరోనా కట్టడికి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఎలాగైనా ఈ కరోనా మహమ్మారిని మన దేశం నుండి వెళ్లకొట్టాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొదిసేపటి క్రితమే .. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరా, దాని లభ్యతకు సంబంధించి ఉన్నత స్థాయి వర్చువల్ సమీక్ష నిర్వహించారు. ఈ ఉన్నత స్థాయి వర్చువల్ సమీక్షలో..దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచేందుకు గత కొన్ని వారాలుగా చేపట్టిన ప్రయత్నాలను అధికారులు వివరించారు. అంతేకాదు, దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తి ఇంకా.. సరఫరాను పెంచడానికి వివిధ రకాలైన వినూత్న మార్గాలను కూడా అన్వేషించాలని ప్రధాని ఆయా మంత్రిత్వ శాఖలను కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: